Tenth Class Exam Fee | టెన్త్‌క్లాస్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
Tenth Class Exam Fee | టెన్త్‌క్లాస్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
ఈ నెల 18 వరకు ఫీజు చెల్లింపునకు గడువు
ఆలస్య రుసుంతో డిసెంబర్ 21 వరకు గడువు
Hyderabad : రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ క్రిష్ణారావు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 18 వరకు ఫీజు చెల్లించడానికి గడువు తేదీ నిర్ణయించారు. ఆ తర్వాత రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. అలాగే బ్యాకలాగ్ ఉన్న విద్యార్థులు రూ.200 ఆలస్య రుసుం తో డిసెంబర్ 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు ఫీజు చెల్లించవచ్చు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని పేపర్లకు మొత్తం రూ.125 ఫీజు చెల్లించాలి. మూడు పేపర్ల లోపు బ్యాక్‌లాగ్‌లు ఉంటే రూ.110, మూడు పేపర్ల కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉంటుందని విడుదలైన షెడ్యూల్‌లో ప్రకటించారు. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు ఇతర వివరాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
* * *
Leave A Comment